ఇప్పుడు సమయం సరిగ్గా 12.30ని. తే 2.4.2011 దీ. ముంబై లోని వాంఖిడి క్రికెట్ స్టేడియం లో భారత, శ్రీలంకల జట్ల మధ్య ప్రపంచ కప్ కోసం మహా సంగ్రామం సరిగ్గా మరొక్క రెండు గంటలలో మొదలు కాబోతోంది.
ఈ తుది పోరులో మన భారత జట్టు గెలవాలని భారతీయులందరూ రకరకాలుగా కోరు కుంటున్నారు. ప్రార్ధనలు చేస్తున్నారు. పూజలూ, హోమాలూ నిర్వహిస్తున్నారు.
అందరం ఒక్కసారి ముక్త కంఠంతో ప్రపంచ కప్ మనదే. మనమే గెలుస్తున్నాం. అనుకుందాం. యద్భావం, తద్భవతి.
తథాస్తు. కప్ గెలిచాక మళ్లీ కలుద్దాం.
మేరా భారత్ మహాన్. జయహో టీమిండియా. జయహో టీమిండియా. జయహో టీమిండియా.
ఈ రాతలో పసి పిల్లాడి మనస్తత్వం కనబడుతోందా ? కనబడినా ఫరవా లేదు. ఇండియా గెలవాలి. అదే చాలు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి