12, జనవరి 2010, మంగళవారం

అత్య(న)వసరం

కంఠం మీద కత్తి
ఎలుగెత్తి పాడ లేను.
ముంజేతికి బ్యాండేజీ
చెల రేగి వ్రాయ లేను

సిరా బుడ్డిలో సాలీడు
సిగరెట్టు నుసి రాల లేదు

అరెరే ! చిక్కులు పడిందయ్యా,
ఆలోచనల దారం !

1 కామెంట్‌:

simplesoul చెప్పారు...

బాగుందండీ.. ఆలోచనల దారం చిక్కులు పడడం!!! నకు నచ్చింది ఈ expression