31, మార్చి 2010, బుధవారం

తేలు కుడుతుంది ....

ఈ కవితా పంక్తులు చదవండి .

తేలు కుడుతుంది
తోడేలు హింసిస్తుంది
తీతువెవ్వరినయిన తిడుతుంది.
ఎందుకీ గతి
జగతి కీలాగు పడుతుంది ?
ఎందుకు శ్మశానమై చెడుతుంది ?

ఈ కవితను రచించిన కవి పేరు చెప్పండి చూదాం ...



ఈనాటి హింసాయుత జీవిత వాతావరణాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా లేదూ ?
మనుషులలో ఎందుకీ అసూయా ద్వేషాలు ? ఎందుకీ కార్పణ్యాలు ? ఎందుకీ పగలు ? అమానవీయ వైఖరులు ఎందుకు ప్రబలుతున్నాయి ?

నారాయణ రెడ్డి గారి కవితలో వాక్యాలు గుర్తుకు రావడం లేదూ ?

ఎక్కడికి పోతున్నాం మనం ?
ఎక్క వలసిన ఎవరెష్టు శిఖరాల పైకా ?
దిక్కు మాలిన పాపాల పాతాళ కుహురాల లోకా ?
ఎక్కడికి పోతున్నాం మనం ?

సరే, మీది కవితను రాసిన కవి ఎవరో ఆలోచించండి ...

తుపాకి గొట్టంలో పిచ్చుక పెంటి నీళ్ళాడాలనే కవి ( దాశరధి ) ఆశయం ఎప్పటికి నెర వేరేను ?


ఇక నుండి నా టపాలన్నీ ఈ బ్లాగులోనే ...

కామెంట్‌లు లేవు: