10, ఏప్రిల్ 2013, బుధవారం

ఉగాది కలల ప్రపంచం ... !!

ఉగాది కలల ప్రపంచం ...


కవులను లేపండి

కోకిళ్ళను కేకెయ్యండి

మావిళ్ళు చిగిర్చాయో లేదో పరికించండి

వసంతం వచ్చిందో, లేదో పరిశీలించండి

ఉగాది పండుగ

ఉల్లాసంగా జరుపుకోండి

ఇల్లంతా అలంకరించండి

కొత్త వస్తువులతో నింపెయ్యండి

అల్లుళ్ళను, అమ్మాయిలను పిలిపించండి

కొత్త బట్టలూ, నగలూ దండిగా పెట్టండి

ఖరీదైన కానుకలతో

ఉక్కిరి బిక్కిరి చేసెయ్యండి.

ఉగాది పండుగ వైభవంగా జరుపుకోండి

మీ అంత వారు లేరనిపించు కోండి.

ఈ కరువు రోజుల్లో

ఇవన్నీ ఎలా సాధ్యమండి ?

అని మాత్రం అడక్కండి ...

పైవన్నీ ఊహల్లో చేసెయ్యండి.

కలల్లో కానిచ్చెయ్యండి !

కళ్ళు మూసుకుని పడుకోండి !

కలల ఉగాది కమనీయంగా ఉంది కదండి ? !

1 వ్యాఖ్య:

Pantula gopala krishna rao చెప్పారు...

కవులు బ్రతికేదే కలల ప్రపంచంలో.అందుకే వారికి లేని కోయిల పాటలు వినిపిస్తాయి.ఈ ధరలో ధరలు పెరగనిదల్లా కలల ప్రపంచంలోనే.అందుకే సరదాగా ఉగాదులైనా అక్కడే గడిపేద్దాం.