16, ఏప్రిల్ 2013, మంగళవారం

తిక్కలోడుఆడంతే నెద్దూ. మా కానోడు. ఇలగంటె అలగంతాడు. అలగంటె ఇలగంతాడు.

ఎడ్డెమంటె తెడ్డెమనీ రకపోడు. ఆడికి తెల్దు. సెప్పితినుకోడు. అదేటంటే, గయ్యిన యింతెత్తు నెగుస్తాడు. నాను కాబట్టి ఆడితో నెగ్గు కొత్తన్నాను కానీ, అదే మరో ఆడదాయయితే ఆడికో దండఁవెట్టి ఎలిపోదును కాదా.

ఓలమ్మ ఇలపింటోడు దొరికి నాడేటి ! సేపల యిగురు సెయ్యిమంతావేఁటి అనడిగితే, రొయ్యల ఏపుడు కావాలంతాడు. తిరపతెల్దారేటంటే, సిఁవాసెలం

సాల్దేటి ? అంటాడు. ఎంప్టీ వోడికి ఓటేద్దాఁవంటే, అచ్చె ! విందిరా గాందీకే ఎయ్యాలంటాడు. ఆయమ్మ ఉప్పుడు నేదు కదా అంతె ఆకాడికి ఎప్టీ వోడు మాత్తరం ఉన్నాడేటని పల్లికిలించి నవ్వుతాడు. ఎంప్టీ వోడంటే ఎంప్టీ వోడు కాదూ, మన సెంద్రబాబు నేడా అంతాను. అదిగదే, విందిరా గాందీ అంతే విందిరా గాందీ కాదూ, మన సోనియా అమ్మ అంతాడు. ఈడితో ఏగనేం బాబూ !

ఆ మద్దెన అదేటమ్మ, ఆ సినేమా ... యాది కొస్తాది కాదు .. అందల బాబేటంతాడూ ? నాక్కొంచెం తిక్కుంది. దానికో నెక్కుంది ! అంటాడు కదా ? మరీడికి తిక్కుంది కానీ నెక్క మాత్తరం నేదు.

ఈ మద్దెన నోక గ్యానం పెంచు కుందాఁవని టీ.పీ సూత్తన్నాను. అందల మన రాజకీయపోల్లు నిబ్బగ కూకోని మాటల్లొ కొట్టు కుంతున్నారూ ? సోద్దె మమ్మా ! సెప్ప నేను. అలగంతె ఇలగంతరు. ఇలగంతె అలగంతరు. ఆడవు నంతె ఈడు కాదంటాడు. జట్టీలాడీసు కుంతున్నారు. నువ్వు నాశినఁవై పోవాలంటే నువ్వు బూడిదై పోవాలంటాడు. నాను సేసిందే కరెస్టంటే, కాదు, నాను సెప్పిందే కరెస్టంటాడు మరోడు. ఆ గోలేటో, ఆ తగువు లేటో ? అల్ల మాటలేటో ? సెప్పీదేటో వొక్క అచ్చరం ముక్క అరదం కానేదనుకో.

అదంతా సూత్తూ ఉంటే, నాకేటనిపిస్తందంటే, నా పెనిమిటే నయమని పిస్తోంది.

టీ.పీ కట్టీసి, ఆడితో నెగు ! నెగు ! రొయ్యల ఏపుడు సెయ్యమన్నావు కాదా ? సేసినాను... రా, తిననానికి .... అన్నాను.

అప్పుడాడంతాడూ !

రొయ్యల ఏపుడేటే ? నెంజికానా ! సేపల పులుసు సెయ్య మననేదా ! నియ్యమ్మ. నీకు మెడ పోత్రఁవెక్కు వయి పోనాదే, అంటూ అరుపులే అరుపులు

మన బతుకులు ఇంతే కావాల్ర బగమంతుడా !

3 వ్యాఖ్యలు:

Sudha చెప్పారు...

మరిగేటి....ఆడ్ని కూడా ఏదో ఓ రాజకీయపార్టీలో సేర్సి టిక్కెట్టిప్పింసీడమేఁ.ఆడ్నాంటాళ్ళకి అదే సరి. ఈపార్టీ ఆపార్టీ అని బాదనేదు. అన్ని పార్టీల్లోనూ తిక్కలోళ్ళే కదా.

ఎగిసే అలలు....· చెప్పారు...

చాలా బాగా రాశారు... నాకైతె ఒకటె నవ్వు....-:)

పంతుల జోగారావు చెప్పారు...

సుధ గారికీ, ఎగిసే అలలు బ్లాగరు గారికీ ధన్యవాదాలు.