24, సెప్టెంబర్ 2011, శనివారం

పంతుల సీతాపతి రావు గారి పద్యాలు





ఇవి మా చిన్నాన్న శ్రీ పంతుల సీతాపతిరావు ( రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ బహుమతి గ్రహీత ) గారి పద్యాలు.




అవినీతి
పంతుల సీతాపతి
కోట్ల కొలది ధనము కొన్నేళ్ళ నుండియు
స్విస్సు బ్యాంకు లందు చేర్చ బడియె
అట్టి ధనమునంత అర్ధాన్తరంముగా
తీసి వేయు టంత తేలికగున?

రాజకీయులంత రాష్ట్రాలు మ్రింగేసి
దాచి పెట్టు కున్న ధనము యదియె ;
రామ దేవు కాదు రాముడే వచ్చినా
నల్ల ధనము తీయ వల్ల కాదు.

ధరలు తగ్గు దలకు ధర్నాలు చేసినా
దీక్ష లెన్నొ జేసి త్రిప్పు లిడిన
పోరు పెట్టి ప్రజలు భోరునా ఏడ్చినా
ధరలు పెంచె గాని తగ్గ లేదు.

రాజకీయపు అవినీతి రాజ్య మేలి
మూల మూలల దేశాన్ని కూల్చు చుండె.
కూర్చు కొన్నట్టి ధనమంత కొల్ల గొట్టి,
సద్దు చేయంగ ఎవరికి సాధ్య మగును.?

అన్న హాజరె అంతటి ఆశ జీవి,
వెతుకు చున్నాడు అవినీతి వెలికి తీయ,
పార్ల మెంటులో బిల్లును ప్రతిప దించ
జంకు చున్నారు మంత్రులు చత్తు మనుచు

టూజీల స్కాములో రాజా యమాత్యులే - కట కటాల వెనుక కాన బడియె!
అక్రమ మైనింగు ఆర్జితంబున నేడు - గాలి సోదరులంత జైలు కెళ్లే! .
తండ్రి పవరు తోడ ధనమెల్ల దొచేసి - జగజెట్టి జగనుడు సాక్షి అయ్యె !
అక్రమార్జిత సేవ అవినీతి కేసులో - తిరుమలేసుని చానలే దొరికి పోయె!
అర్హతే లేని అవినీతి పరులే నేడు
నీతి వాక్యాలు పలికెడి నేతలయ్య్
నోట పలికిన ప్రతిమాట బూట కాలె
నమ్మ రాదండి ఎవరినీ నమ్మ వలదు!

సిగ్గు మాలిన నేతల నిగ్గు తేల్చి
పరువు పోయేల వారిని తరిమి కొట్ట
కడలి రావాలి యువ శక్తి కవనమునకు
అప్పుడే కదా అవినీతి అంత రించు .










1 కామెంట్‌:

కమనీయం చెప్పారు...

నేటి రాజకీయ నేతల యవినీతి
విప్పిజూపి చాల వివరించి తెల్పగ
కైత రూపమందు కల్పించి చెప్పిరి
అందుకొనుడు వినుతి నాదరముగ