పర్యా వరణం కలుషితం కాకుండా రేపటి వినాయక చవితి పండుగ నాడు అంతా కేవలం మట్టి వినాయకులనే పూజించాలని పత్రికలూ , టీ.వీ లూ చాలా చక్కగా ప్రచారం చేస్తున్నాయి. మంచిదే.
పత్రికల వారికీ, టీ.వీ ల వారికీ ఒక చిన్న విన్నపం.
మట్టి వినాయకుని పూజించండి అని కేవలం ఊదర గొడుతూ ప్రచారం చేస్తే చాలదు. మీరు రేపటి నుండి చూపించ బోయే వినాయక చవితి ఉత్సవాల విశేషాల విషయంలో ఒక నియంత్రణ పాటిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.
1. మట్టి వినాయకులకు జరిగిన పూజా విశేషాలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వార్తలు ప్రముఖంగా ప్రచురించాలి. ప్రదర్శించాలి.
2. మట్టి వినాయకుడు కాకుండా పర్యా వరణానికి హాని కలిగించే ఏ విగ్రహాలకీ , వాటి గురించిన వార్తలను ప్రముఖంగా కాకుండా వాటి ఉనికిని చిన్నది చేస్తూ వార్తలు ప్రచురించాలి. ప్రసారం చేయాలి.
3. మట్టివి కాని విగహాలూ , వాటికి జరిగే పూజలూ , ఉత్సవాలూ అవి ఎంత పెద్ద వయినా, ఎంతటి ప్రముఖులవయినా వాటిని గురించి ఆకర్షనీయమైన కథనాలు మాను కోవాలి. తప్పని సరి అయితే వాటికి కొద్దిపాటి ప్రాముఖ్యత ఇవ్వాలి.
4. ప్రచారం కోసం , అలాంటి ఆర్భాటాల కోసం జరిగే వ్యర్ధమైన పోటీ తత్వం వినాయక విగ్రహాల విషయంలో తగ్గంచాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి