13, సెప్టెంబర్ 2010, సోమవారం

నేను తప్పు చేసానా? 2 ( ఈ సారి తొలిగించడం లేదు)

నేను ఈ మధ్య నేను తప్పు చేసానా? శీర్షికతో ఒక టపా ప్రచురించి వెంటనే మనసు మార్చుకుని, దానిని తొలిగించి వేసాను.
కాని, నా టపా హారం వారి జాబితాలో ఉండి పోయింది. ఇవాళ హారం వారి జాబతా చూద్దును కదా, ఎక్కువగా చదివిన టపాల శీర్షిక క్రింద నా నేను తప్పు చేసానా? ఉంది. ఇంతకు ముందు నా టపాలేవీ వారి ఎక్కువగా చదివిన టపాల విభాగంలో చేర గలిగే భాగ్యానికి నోచుకో లేదు.తొలిగించిన ఈ టపానే చూడడానికి ఎక్కు వమంది ఎందుకు ఉత్సుకత చూపిస్తున్నారు అని ప్రశ్నించు కుంటే, అది ఆ టపా శీర్షిక ప్రభావం అనిపించింది.

సరే, ఎక్కువ మంది చదవడానికి ఉత్సాహం ప్రదర్శించిన ఆ టపాలోని అంశాలు ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాను. చూడండి:

ఈ మధ్య నేను ఒక బ్లాగు చూసి, ఆ బ్లాగు శీర్షికలో అక్షర దోషం ఉండడం గమనించి వీలయితే సరిదిద్దు కోమని సూచిస్తూ కామెంట్ పెట్టాను. ఆ బ్లాగ్ నిర్వాహకుడు నా కామెంట్ను ఎందుకో ప్రచురించ లేదు. సరి కదా బ్లాగు శీర్షికను సరి చేయనూ లేదు.

ప్రమాదో ధీమతామపి. ఎవరికయినా కొన్ని పొరపాట్లు సహజం. అచ్చుతప్పులు రావడం సహజమే. నేనైనా, మీరైనా ఎవరైనా ఆ తప్పులను దృష్టి లోకి తెచ్చి నప్పుడు అన్యథా భావించకుండా సరి చేసుకుంటే ఏం మునిగి పోతుంది?

మన తెలుగు బ్లాగర్లం అలా ఒకరు పరాకుగానో, తెలియమి చేతనో చేసిన తప్పులను మరొకరం సున్నితంగా ఎత్తి చూపించుకుంటూ ఆరోగ్య కరమయిన వాతావరణంలో బ్లాగులు వ్రాసుకుందామని కోరుతున్నాను.

తన బ్లాగు శీర్షిక లోని తప్పుని ఎత్తి చూపి, ఆ బ్లాగు నిర్వామకుడిని నేను మనసు గాయ పడేలా చేసానా. నేను తప్పు చేసానా? వారి మనసు బాధ పడి ఉంటే మన్నించమని కోరుతున్నాను.

ఇదీ నేను తొలగించిన, పాఠకులు ఎక్కువగా చూడడానికి ప్రమత్నించి, మీరు చూస్తున్న టపా ఈ పేజీ లో లేదు అని వస్తే బహుశా, చిరాకు పడిన టపాలోని మేటరు.

ఇప్పుడు చెప్పండి. నేను తప్పు చేసానా?

9 వ్యాఖ్యలు:

Dinakar చెప్పారు...

మన బ్లాగ్లోకం లో సుహృద్భావ వాతావరణం లోపించింది అండి.. మీ వ్యాఖ్య ప్రచురించకపోయినా ఫర్వాలేదు కాని మళ్లీ మీ మీద కచ్చ పెట్టుకుని మిమ్మల్ని నిందంచనంత వరకు మీరు భాగ్యవంతులే!..

అజ్ఞాత చెప్పారు...

meeru blog template kaanee, font color kaanee marchagalaraa, mee blog chadavaalante konchem ibbandi ga vundi , eyes stain avuthunnaai...

Pramida చెప్పారు...

ledu... cheyaledu....

ప్రేమిక చెప్పారు...

nuvvu tappu cheyyaledu kakapothe mee blog chadavadaniki chala ibandi ga undi....

అజ్ఞాత చెప్పారు...

please change ur font color, its very horrible to read

chanakya చెప్పారు...

కొంపదీసి మీరన్న బ్లాగర్ నేను కాదు కదా..! నా శరచ్చంద్రికలో తప్పు లేదని మళ్లీ మీరే మెయిల్ చేశారని ఊరుకున్నాను.

అజ్ఞాత చెప్పారు...

plz change the background and font color..

పంతుల జోగారావు చెప్పారు...

అందరకీ నా ధన్యవాదాలు. నా బ్లాగు నేపథ్యం, రంగు, ఫాంటు అన్నీ చూడడానికి చాలా ఘోరంగా ఉన్నాయని మీ రాతల వలన తెలుసుకున్నాను. వెంటనే మారుస్తాను.
ఈ టపా పెట్టాక కేంప్ వెళ్ళి 25 రోజుల తర్వాత ఇప్పుడే వచ్చాను. అందుకే మీ అందరినీ పలకరించడంలో చాలా జాప్యం జరిగింది.

@ చాణక్య గారూ, మీ గురించి కాదండీ.
నేను తరుచుగా టపాలు రాసే బ్లాగు కథా మంజరి.
దాని లింక్ ఇది:

http://kathamanjari.blogspot.com

జ్యోతిర్మయి చెప్పారు...

జోగారావుగారూ మీలాంటి వారు దిద్దితే మేమింకా సంతోషిస్తాము. ధన్యవాదములు