8, జనవరి 2010, శుక్రవారం

శ్రీ.శ్రీ గారి ఏవి తల్లీ ! గీతానికి పేరడీ














ఏవి
తండ్రీ !


చక్ర పొంగళి ప్లేటు ఎచ్చట ?
రవ్వ లాడూ వుండ లెచ్చట ?
ఏవి సర్వర్ ఆర్డరిచ్చిన
ఇడ్లి పెసరట్టూ !

శ్రీనాథ మహా కవీంద్రుని
జిహ్వాగ్రమున కరింగిన
వంటకాల్ నేడెక్కడయ్యా ?
కలవు చూపించు !

విజయ రాఘవ మందిరంలో
తృప్తి మీరిన త్రేన్పు లెచ్చట ?
గోప బాలురు నాడు మెక్కిన
మాగాయ పచ్చడేది తండ్రీ !

వేడి సాంబార్ సెగల కేళీ
లోచనోత్సవ రోచు లేవీ ?
ఉల్లి వేసిన గట్టి పకోడీ
కర కర ధ్వను లెక్కడయ్యా !

ఎక్కడయ్యా కృష్ణ దేవుని
తృప్తి పరచిన విదుర విందు ?
ఖ్యాతి నొందిన భీమ పాకపు
గుమ గుమలవి ఏవి తండ్రీ !

ఉల్లి దోశ, వడా సాంబార్
మిరప బజ్జీ, సేమ్యాకిచిడీ
రుచుల దేల్చెడి టిఫిన్లేవీ
కాన రావేమీ ?

నీళ్ళు తెచ్చిన గాజు గ్లాసును
నేడు కడిగిన జాడ లేవీ ?
ఏవి సర్వర్ ఆర్డరిచ్చిన
ఇడ్లి పెసరట్టూ ?


మహా కవి శ్రీ. శ్రీ గారి ఏవి తల్లీ ! గీతానికి ఇది పేరడీ రచన. మహా కవికి క్షమాపణలతో.
ఈ రచన ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రిక 17 - 8- 1973 సంచికలో ప్రచురణ.

కామెంట్‌లు లేవు: